రాజధాని పై ఎవరో ఏదో చెబితే… నాకేటి సంబంధం‌‌‌…మంత్రి బొత్స


రాజధాని పై ఎవరో ఏదో చెబితే… నాకేటి సంబంధం‌‌‌…. సీఆర్‌డీఏ సమీక్ష అనంతరం మంత్రి బొత్స…

సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్ష ముగిసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి బొత్స, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. రాజధానికి మొత్తం 64 వేల మంది రైతులు భూములు ఇచ్చారని, 43 వేల మంది రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగిందని, మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు.

రైతులకు కౌలు బకాయిల చెల్లింపులు రేపటి నుంచే జరపనున్నామని, రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బొత్స పేర్కొన్నారు. సమీక్షలో రాజధాని అంశంపై వాస్తవాలు పరిశీలించామని, ముంపు సమస్య చర్చకు రాలేదన్నారు. రాజధాని విషయంలో ఎవరికీ అనుమానల్లేవని పేర్కొన్నారు బొత్స.

రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేంటి సంబంధం అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాజధానికి సంబంధించి రూ.35వేల కోట్లతో టెండర్లు పిలిచారని, ఆర్థిక పరిస్థితులు చూసి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని మరోసారి వ్యాఖ్యానించారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోందని, ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదన్నారు బొత్స…

#అమరావతి #రాజధాని #బొత్స #Amaravathi #CRDA #Botsa #Capital

About The Author