స్త్రీ చేతులకి గాజులు ఎందుకు వేస్తారు..?


అలంకారణ
గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..
మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు. ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.
అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి,గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని.
పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి. అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.
ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారందొరుకుతుంది

 

About The Author