ఎర్ర చందనం దుంగలు డంపు పట్టివేత…నలుగురు స్మగ్లర్లు అరెస్ట్…
నలుగురు స్థానిక స్మగ్లర్లు ఒక నాటు తుపాకీ, స్కూటర్ స్వాధీనం. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ వెల్లడి
టాస్క్ ఫోర్స్ బృందం రైల్వే కోడూరు ఎన్ వి ఎస్ గిరిజన కాలనీ, చియ్యవరం బీట్ సెక్షన్ లోని మామిడి తోట లో రవాణా చేయడానికి సిద్దంగా ఉన్న 22 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ తెలిపారు. దుంగలతో పాటు నలుగురు స్థానిక స్మగ్లర్లు ను, ఎస్ బి ఎమ్ ఎల్ తుపాకీ, గుండ్లు, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లర్లు ను అరెస్ట్ చేసి, తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సివిల్ పోలీసు శ్రీహరి సమాచారం మేరకు ఆర్ ఎస్ ఐ రవి కుమార్, డి ఆర్ ఒ వరప్రసాద్ బృందం మాటు వేసి స్మగ్లర్లు ను అనుసరించి పట్టుకున్నారని చెప్పారు. సంఘటన స్థలానికి తన తో పాటు డీఎస్పి అల్లా బక్ష్, ఆర్ ఐ సత్యనారాయణ చేరుకుని పరిస్థితి ని సమీక్షించి నట్లు తెలిపారు.
పట్టుబడిన స్థానిక స్మగ్లర్లు వివరాలు
(1) పాలెపు మనోహర్ – వయస్సు – 24
S/o సుబ్బరాయుడు . ఇతను వెంకటరెడ్డి పల్లి ST కాలనీ, రైల్వే కోడూరు మండలంకు చెందినవాడు. ఇతను ఆటో డ్రైవరు.
(2) పాలెపు శ్రీకాంత్ – వయస్సు – 22
S/o శ్రీనివాసులు . ఇతను వెంకటరెడ్డి పల్లి ST కాలనీ, రైల్వే కోడూరు మండలంకు చెందినవాడు. ఇతను ట్రాక్టర్ డ్రైవరు.
(3) బైనేని శ్రీహరి – వయస్సు – 25
S/o బైనేని చిన్నయ్య . ఇతను నాగవరం విలెజ్ , అలిశెట్టి హరిజనవాడ , చిట్వేలి మండలం కు చెందినవాడు.
(4) K . పెంచలయ్య – వయస్సు – 25
S/o ఈశ్వరయ్య . ఇతను నాగవరం విలెజ్ , అలిశెట్టి హరిజనవాడ , చిట్వేలి మండలం కు చెందినవాడు.