తిరుమలలో ఘనంగా శ్రీ వరాహస్వామి జయంతి…

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం …ప్రతి సంవత్సరం… శ్రీవరాహస్వామి జయంతిని… టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది.

ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం వరాహ జయంతి ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 9.00 నుంచి 10.30 గంటల మధ్య పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. 

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామి వారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ వ‌రాహ‌స్వామివారి చిత్ర‌ప‌ట్టం బ‌హూక‌ర‌ణ‌-

          విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ క‌ళాకారుడు(ఆర్టిస్ట్) శ్రీ ఎన్‌.వి.ర‌మ‌ణ తిరుమ‌ల  శ్రీ వ‌రాహ‌స్వామివారి చిత్రాన్నిక్యాన్వాస్ పెయింటింగులో వివిద ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల‌తో  చిత్రించారు. దీనిని ఆదివారం ఉద‌యం శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

About The Author