ప్రభుత్వ, మఠం భూఆక్రమణల మాఫీయాను వదిలిపెట్టం,
తిరుపతి ఉప్పార పల్లి సమీపంలో హథీరాం జీ మఠం భూముల సమస్యలపై తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానికులతో మాట్లాడుతున్న తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు ఆర్డీఓ కనక నరసారెడ్డి గారు తదితరులు..
పేదలు వుంటే వారి డాక్యుమెంట్లు అందించండి పరిశీలించి న్యాయం చేస్తాం – ప్రభుత్వ విప్
తిరుపతి ప్రభుత్వ భూములు, మఠం భూములు ఆక్రమించి డ్యాక్యుమెంట్లు సృష్టించి అమ్ముతున్న వారిని ఎట్టిపరిస్థిల్లో ఉపేక్షించేది లేదని, తెలియక కొనుగోలు చేసి వుంటే డాక్యుమెంట్లను పరిశీలించి అందులో పేదలకు, నిరుపేదలకు అన్యాయం తలపెట్టమని న్యాయంచేస్తామని ప్రభుత్వ విప్ మరియు తుడా శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆవిలాల వద్ద తొలగించిన ఆక్రమణలకు సంబంధించిన వారితో ప్రభుత్వ విప్ సమావేశమై వారి వద్ద నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ భూములు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వుండాలని , మాఫీ భారిన పడరాదని అన్నారు. గతంలో వున్న రెవెన్యూ, పంచాయితీ రాజ్ సెక్రటరీ, విద్యుత్ కనెక్షన్ వంటివి ఇచ్చి తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని , చాలా డ్యాక్యుమెంట్లు దొంగగా సృష్టించి తహశీల్దార్, ఆర్డిఓ , రిజిష్ట్రార్ సీళ్ళు తయారుచేసుకుని వాటిని పత్రాలపై ముద్రించి మోసం చేశారని తేలిందని అన్నారు.