వినాయక నిమర్జనం సందర్భంగా.. తిరుపతి పట్టణం నందు.. ట్రాఫిక్ మళ్ళింపు
తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ డి.యస్.పి శ్రీ s.ముస్తాఫ్ఫా వారి సూచనల తిరుపతి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ యం.సురేష్ కుమార్, తిరుపతి నగరము లో ప్రజలు రేపు అనగా 04-09-2019 వినాయకచవితి విగ్రహాల నిమజ్జన కార్యక్రమములో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగముగా పత్రికా ముఖముగా తిరుపతి పట్టణ ప్రజలకువినాయక సాగర్ లో నిమజ్జనమునకు సంభంధించి మార్గ సూచీని రూపొందించినారు.
టి వి యస్ జంక్షన్ >అన్నమయ్య జంక్షన్,>ఏమార్ పల్లి>వెస్ట్ చర్చి>బాలాజి కాలనీ>,టౌన్ క్లబ్బు>ప్రకాశంరోడ్డు>కెపిటానా>నాలుగుకాళ్ళమండపము >తిలక్ రోడ్డు ,మున్సిపల్ ఆఫీసు మీదుగా దేవేంద్రా థియేటర్ రోడ్డు ,లీలమహల్ సర్కల్ గుండా వినాయక ససాగరు కు వెల్ల వలేను .
అన్నారావు జంక్షన్> భవానీ నగర్ జంక్షన్ > వి వి మహల్ రోడ్డు >మున్సిపల్ ఆఫీసు మీదుగా ,దేవేంద్రా థియేటర్ రోడ్డు>,లీలమహల్ సర్కల్ గుండా వినాయక సాగరు కు వెల్ల వలేను .
రామకృష్ణా డీలక్స్> భవానీ నగర్ జంక్షన్ > వి వి మహల్ రోడ్డు >మున్సిపల్ ఆఫీసు మీదుగా ,దేవేంద్రా థియేటర్ రోడ్డు>,లీలమహల్ సర్కల్ గుండా వినాయక సాగరు కు వెల్ల వలేను .
ఈ క్రింది ఏరియాలనుండి వినాయక విగ్రహాలు వెళ్ళుటకు అనుమతి లేదు
గరుడాజంక్షన్ వయా నంధి సర్కల్, మున్సిపల్ పార్కు నుండి లీలమహల్ వరకు
లక్ష్మిపురం జంక్షన్ నుండి పూర్ణఖుంభమ్ జంక్షన్ వరకు వయా రమనుజా సర్కిల్
తిరుపతి నగరములోనికి రేపు అనగా04-09-2019 బస్సులు/ఇతర వాహనాలు వెళ్ళు మరియు వచ్చు మార్గములు:-
చిత్తూరు ,బెంగళూరు మరియు మదనపల్లి నుండి వెళ్ళు మరియు వచ్చు వాహనాలు ,పూర్ణఖుంభమ్ జంక్షన్ , రామానుజం సర్కల్ ,లక్ష్మిపురం జంక్షన్ ,అన్నమయ్య జంక్షన్ , వయా ఏం ఆర్ పల్లి పోలీసు స్టేషన్ మీదుగా వెల్ల వలేను .పుత్తూరు,నెల్లూరు ,కడపవైపు వెళ్ళు మరియు వచ్చు బస్సులు / ఇతర ట్రావెల్స్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు పూర్ణఖుంభమ్ జంక్షన్ , రామానుజం సర్కల్ రేణిగుంట రోడ్ మీదుగా మీదుగా వెల్ల వలేను .
తిరుమల కు వెళ్ళు బస్సులు మరియు ఇతర ట్రావెల్స్ వాహనాలు తిరుపతి రైల్వే వే స్టేషన్ మీదుగా, బెరి వీధి,టౌన్ క్లబ్ జంక్షన్,,యస్.వి.ఆర్ ఆర్ హాస్పిటల్ జంక్షన్ మీదుగా వెళ్లవలెను తిరుపతి పట్టణ ప్రజలు రేపు అనగా 04-09-2019 తేదీన ట్రాఫిక్ నియమాలను పాటించి ట్రాఫిక్ పోలీసువారికి ట్రాఫిక్ క్రమభద్ధీకరణలో మీవంతు సహకారమును అందించి ట్రాఫిక్ సాఫీగా వెళ్ళుటకు నగర ప్రజల/యాత్రికుల భద్రతకు తోడ్పడగలరు.