జరగనున్న వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి- గిరీషా పి.ఎస్.

తిరుపతి, : నగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి, విధులు కేటాయించిన అధికారులు అప్రమత్తంతో వ్యవహరించి బుధవారం నిమజ్జనం పూర్తి అయ్యేవరకు విధుల్లో వుండి సేవాలందించాలని నగరపాలక కమిషనర్ పీఎస్ గిరీషా ఒక ప్రకటనలో తెలిపారు. భారీ విగ్రహాలను తరలించేటప్పుడు ఇదివరకే మీకు సూచించిన మార్గాల నుండే వినాయక సాగర్ చేరుకోవాలని అన్నారు. ఇది వరకు అనుకున్న విదంగా మధ్యాహ్నం కాకుండా ఉదయం నుండే విగ్రహాల తరలింపుకు సహకరించాలని, రేపు కూడా భారీ వర్ష సూచన వుందని నగర ప్రజలు, మండప నిర్వాహకులు గమనించి సాయంత్రం లోపే పూర్తి అయ్యేటట్లు  సహకరించాలని, నిమజ్జన కమిటీ సూచనలు పాటించాలని అన్నారు. గృహాల్లో పూజించిన విగ్రహాలు చిన్నవి వినాయకసాగర్ ఉత్తరం వైపు ఉన్న రాంపు వద్ద నిమజ్జనం చేయాలని, పెద్ద విగ్రహాలను తూర్పు వైపు ఉన్న రెండు చోట్ల నిమజ్జనం చేయవలసిన ఉంటుందని అన్నారు. గజ ఈతగాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. రెండు అంబులెన్స్ లు, మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉండాలని అన్నారు. బుధవారం పూర్తి స్థాయి

About The Author