విలువలతో కూడిన విద్యాభోదన అవసరం
ప్రమాదం వల్ల విద్యను మానేయాలనే నా ఆలోచన గురువుల ప్రోత్సాహంతో సాగి ఐ. ఏ. ఎస్. నయ్యా – గిరిషా పి.ఎస్.తిరుపతి ,: విద్యార్థి దశ నుండి జీవిత సత్యాలు, సార్థకత నేర్పేది గురువులేనని, గురుపూజోత్సవం రోజును ఉపాద్యాయులు సెలవు దినంగా చూడరాదని, అనుబంధాలు, ఆత్మీయతలు పెంచుకోవాలని ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక ఎస్. వి. యూనివర్సిటీ ఆడిటోరియమ్ లో చంద్రగిరి నియోజక వర్గంలో పాఠశాలల , కళాశాలల ఉపాధ్యాయ, అధ్యాపకుల గురుపూజోత్సవ కార్యాక్రమం తుడా ఛైర్మన్ ఆధ్వర్యంలో జ్యోతిని వెలిగించి, మా తెలుగు తల్లి గేయం తో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి గౌరవ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరో రెండు సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి, ప్రైవేట్ విద్యాలయాల కన్నా ఆదర్శంగా నిలవాలనే స్సంకల్ప తో వున్నారని అన్నారు. ఆ మేరకు చంధ్రగిరి నియోజక వర్గం పరిధిలో వున్న విద్యాలయాలను ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు ఉపాధ్యాయు