ఆటోఅన్నలకు అండగా సిఎం జగన్ చేయూత…
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..సొంతంగా వాహనాలు (ఆటో, ట్యాక్సీ) ఉంటూ..జీవనం గడుపుతూ కష్టాలు పడుతున్న వారిని ఆదుకుంటామని.. ఎన్నికల సందర్భంగా జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ కేబినెట్ ఈ విషయంపై చర్చించి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌కు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.
ప్యాసింజర్, ఆటోలు ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వాలని (భార్య – భర్త ఒక యూనిట్‌గా లెక్కింపు). మేజర్ అయిన కూతురు లేదా కొడుకు సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉంటే వారికి కూడా ఏటా రూ. 10 వేలు అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సుమారు రూ. 400 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని…4 లక్షల మందికి లబ్ది చేకూరబోతోందన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. సెప్టెంబర్ నాలుగో వారంలో దరఖాస్తులన్నింటినీ స్క్రూటీని చేసి..పథకానికి మంజూరు చేస్తామని, లబ్దిదారులకు నేరుగా బ్యాంకులో నగదు జమ చేస్తామన్నారు.
#ApCMjagan #ThepeopleCM