ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రత

తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి     ప్రపంచప్రఖ్యాత, ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్న‌ట్లు టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని పిఏసి-4లో, గ‌ల కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌,లో శుక్ర‌వారం ఉద‌యం విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌త్యేక ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చిన టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బందికి న‌గ‌దు బ‌హూమ‌తిని ప్ర‌ధానం చేశారు.    ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌త్యేకాధికారి మాట్లాడుతూ తిరుమ‌ల‌లో భ‌ద్ర‌తా మ‌రియు నిఘా వ్య‌వ‌స్థలు చాల బాగుంద‌న్నారు. తిరుమ‌ల‌ను నేర ర‌హిత పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని కోరారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లోని అన్ని ప్రాంతాల‌లోని 564 సిసి టివిలు కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌కు అనుసంధానించిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో ఇజ్రాయ‌ల్ టెక్నాల‌జీతో కూడిన భ‌ద్రాత వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు

About The Author