నేటి సచివాలయ పరీక్షల హాజరు శాతం ఉదయం 71.7, మద్యాహ్నం 92.37.
ఈనెల 7 న *తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి* లలో సచివాలయ పరీక్షలు జరగ నున్న కేంద్రాలు 26 – కనకనరసా రెడ్డి
తిరుపతి, సెప్టెంబర్ 06: నేడు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఉదయం 71.7 శాతం,మద్యాహ్నం 92.37 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని, ఈ నెల 7న చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట కేంద్రాలుగా ఉదయం 9226 మంది, మద్యాహ్నం ఒక కేంద్రంలో 821 మంది వ్రాయనున్నారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరిగిన సచివాలయ ఉద్యోగాలకు సంబందించిన గ్రామ మత్స్య శాఖ సహాయకుల పరీక్ష ఉదయం 3 కేంద్రాలలో 735 మంది పరీక్షలు వ్రాయాల్సి వుండగా 527 మంది హాజరయ్యారని 71.7 శాతంగా వుందని తెలిపారు. మద్యాహ్నం జరిగిన సచివాలయ పశు సంరక్షణ సహాయకులు పరీక్షకు 603 మంది హాజరు కావాల్సి వుండగా, 557 మంది హాజరయ్యారని హాజరు 92.37 శాతంగా వుందని తెలిపారు. అలాగే వరుసగా ఐదవ రోజు పరీక్షలు శనివారం ఉదయం 10.00 నుండి 12.30 వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గ్రేడ్ 2, వార్డ్ అమినెటీస్ సెక్రటరీ పరీక్షలు తిరుపతి, రేణిగుంట,