తండ్రి పేటీఎం… డబ్బులు మాయం, ఆన్‌లైన్ గేమ్స్‌తో కొడుకు మజా…!

 

ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు ఓ 4th క్లాస్ విద్యార్థి తన తండ్రి ఖాతా నుండి 35వేల రుపాయలు ఖర్చు పెట్టాడు. ఇందుకోసం ప్రత్యేకంగా పేటీఎం అకౌంట్ క్రియోట్ చేసి తండ్రి అకౌంట్‌ను జోడించాడు. దీంతో ఆన్‌లైన్ గేమ్‌ కోసం తనకు అవసరమైనప్పుడల్లా బ్యాంకు నుండి పేటీఎంకు డబ్బులు జత చేశాడు. ఇలా సంవత్సరం నుండి ఆన్‌లైన్ గేమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తన ఖాతా నుండి డబ్బులు ఎలా మాయం అవుతున్నాయో తెలియని తండ్రి తలలు పట్టుకుని చివరకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

యూపీలో సంఘటన

ఉత్తర ప్రదేశ్‌‌లోని లక్నోకు చెందిన ఓ నాలుగో తరగతి విద్యార్థి తన తండ్రినే చీట్ చేశాడు. ఆన్‌లైన్ గేమ్స్ కోసం ఫోన్‌లో పేటీఎం ఖాతా ఓపెన్ చేసి బ్యాంకు ఖాతను జోడించాడు. దీంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ పేటీఎం నుండి డబ్బులు చెల్లించాడు. ఇలా సంవత్సర కాలంగా ఆన్‌లైన్ గేమ్స్ కోసం తండ్రికి తెలియకుండానే డబ్బులు మాయం చేశాడు. దీంతో బ్యాంకు ఖాతాలో డబ్బుల మిస్టరీపై తండ్రి అయోమయానికి గురయ్యాడు. పలు సార్లు బ్యాంకు చుట్టు తిరగిన ఫలితం దక్కలేదు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనిగా అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డబ్బు మిస్ట్రీని చేధించిన పోలీసులు

రంగంలోకి దిగిన పోలీసులు డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయనే విషయాన్ని కనుగున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో స్వంత మొబైల్ నెంబర్ బ్యాంకు ఖాతాకు ఉండడం గమనించారు. పిర్యాధు దారు మొబైట్ నుండే డబ్బులు మాయం అవుతున్నట్టు పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని అతనికి తెలపడంతో ఒక్కసారిగా తండ్రి షాక్ తిన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పిల్లవాడితో కొద్దిసేపు మాట్లాడారు. ముందు భయంతో తాను చేసిన తప్పును ఒప్పుకోని బాలుడు…కొద్ది సేపటి తర్వాత విషయాన్ని బయటపెట్టాడు. తానే పేటీఎం ఖాతను ఓపేన్ చేశానని ఒప్పుకున్నాడు. అయితే తన తప్పును ఒప్పుకున్న విద్యార్థి తండ్రి కొడతాడానే భయంతో వణికి పోయాడు. పోలీసులు బాలుడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

About The Author