యాప్ ఉపయోగంతో తప్పులులేని ఇంటింటి సర్వేలోచేయాలి – సందీప్ సక్సేన
ప్రతిసంవత్సరం దేశవాప్తంగా ఓటర్ల జాబితాల సవరణలు చేస్తుండటంలో భాగంగా ప్రత్యక ఓటర్ల సవరణ జాబితా 15.01.2020 న ప్రకటించవలసి వున్నదని, గతంలో ఎన్నికల సమయాల్లో సవరణలు, మార్పులు, తొలగొంపులు చేయడం వంటి విధానం కాకుండా ఎప్పటికప్పుడు నేడు ఎన్నికల కమిషన్ సూచించిన బూత్ లెవల్ ఆఫీసర్ యాప్ ద్వారా చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ,సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా.సందీప్ సక్సేన ఐ.ఎ.ఎస్. సూచించారు. శనివారం ఉదయం స్థానిక శ్రీపద్మావతి అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా, నగరపాలక కమిషనర్ గిరీషా పి.ఎస్., మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి, తిరుపతి, చిత్తూరు ఆర్డీఓలతో సమావేశమై ప్రత్యక ఓటర్ల జాబితా సవరణ జాబితా – 2020 పై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సాంకేతిక విధానంతో ముందుకు పోతున్నదని, కమిషన్ సూచించే సాంకేతికతలో బి.ఎల్.ఓ.లు ప్రస్తుతం జరుగుతున్న సవరణల జాబితా యాప్ ద్వారా రూపొంధించాలని, ఓటరు కార్డులో తప్పులను, అడ్రసు మార్పుల