చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు..

 

సూపర్ స్టార్ మహేష్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు. అయితే తన చిత్రాల సక్సెస్ ఇచ్చిన ఆనందానికి మించిన తృప్తి ఇప్పుడు మహేష్ బాబుకి దక్కి ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మెసేజ్ మూవీస్ పైన ఆసక్తి చూపించే మహేష్ నిజ జీవితంలో కూడా తాను ప్రజల మనిషిని అని నిరూపించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1000 మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్స లు చేయించాడు మహేష్ బాబు. తన సినిమాలతో సమాజానికి సందేశం ఇవ్వడం మాత్రమే నిజజీవితంలో కూడా తన ఫ్యాన్స్ మరియు తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాడు మహేష్.మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో 18 క్యాంపులు నిర్వహించాడు.గత మూడేళ్లుగా జరుగుతున్న ఈ ప్రక్రియలో సరిగ్గా నిన్నటికి వెయ్యి మందికి పైగా చిన్నారులకు విజయవంతంగా మహేష్ చేపట్టిన ఫౌండేషన్ హృదయ సంబంధిత శస్త్రచికిత్సలు చేసింది. ఇందుకు ఆంధ్ర హాస్పిటల్స్, మహేష్ బాబు కలిసి ఇంగ్లాండ్ కి చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ పౌండేషన్ తో చిన్నారుల ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. మహేష్ కు హృద్రోగం బాధపడే చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేయించాలి అన్న ఆలోచన అతని కొడుకు గౌతం వల్ల వచ్చింది అని మహేష్ చెప్పుకొచ్చాడు.గౌతమ్ పుట్టిన వెంటనే అతని ఆరోగ్య పరిస్థితి చాలా బాగోలేదట. కడుపులో ఉన్నప్పుడే గౌతమ్ బయటికి రావడం చాలా కష్టం అయిందని వచ్చిన తర్వాత కూడా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి చివరికి ఒక శస్త్రచికిత్సకు దారితీసిందని మహేష్ చెప్పాడు. తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొడుకుని బతికించుకోగలిగాను కానీ పేద వారి సంగతి ఏమిటి అని ఆలోచించిన మహేష్ అప్పుడే ఉచిత శస్త్ర చికిత్సలకి నాంది పలికాడు. ఇలాగే మహేష్ బాబుని ఆదర్శంగా తీసుకుని మిగతా కథానాయకులు కూడా ఏదో ఒక రకంగా ప్రజా సేవ చేయాలని ఆశిద్దాం. చివరగా మరొక్కసారి హ్యాట్సాఫ్ మహేష్.

About The Author