రంగారెడ్డి ప్రాజేక్టు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షా…


పాలమూరు – రంగారెడ్డి ప్రాజేక్టు నిర్మాణ పనులపై ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధుల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం.ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి లతో పాటు పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, రాములు, శాసన సభ్యులు లక్ష్మారెడ్డి, గువ్వల బాలారాజు, మర్రి జనార్థన్ రెడ్డి, అంజయ్య యాదవ్, బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, బీరం హర్షవర్థన్ రెడ్డి ఆబ్రహం లతో పాటు ఇరిగేషన్ అధికారులు సి ఈ లు ఖగేందర్, రమేష్ , ఎస్ ఈ లు నర్సింగ్ రావు , అంజయ్య లతో పాటు ఈఈలు, డీ ఈ లు పాల్గోన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇటివల పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై క్షేత్ర స్థాయి పర్యటన చేసిన అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశం లో సూచించిన పలు అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ధేశించిన గడువు లోపల పాలమూరు – రంగారెడ్డి ప్రాజేక్టు పనులు పూర్తిచేయాలని అధికారులను ఈ సమీక్షా సమావేశంలో కోరారు.
అంతేగాకుండా ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోయిల్ సాగర్ రిజర్వాయర్ ను పాలమూరు – రంగారెడ్డి ఏత్తిపోతల పథకం ప్రాజేక్టు ను హన్వాడ ద్వారా నే నింపాలని అధికారులను అదేశించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపోందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కాళేశ్వరం ప్రాజేక్టు ను శరవేగంగా పూర్తి చేశారు. అదే వేగంతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజేక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదేశించారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి అదేశాల మేరకు పాలమూరు – రంగారెడ్డి ప్రాజేక్టు పూర్తి కి శక్తివంచన లేకుండా ఇరిగేషన్ అధికారులు మూడు షిప్టు లలో పనులను చేపట్టి పూర్తి చేయాలని కోరారు. గత పాలకుల తప్పిదాలను సరిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి సూచనల మేరకు ప్రాజేక్టు పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. శాసన సభ్యులు సూచించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. గత ఎండాకాలంలో నీటి ఎద్దడి కారణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం జూరాలకు నీటిని విడుదల చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్ లో ఆ పరిస్థితి రాకుండా కర్వెన రిజర్వాయర్ నుండి సంగంబండ, సంగంబండ నుండి జూరాల రిజర్వాయర్ కు నీటిని నింపుకునేలా ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించారు.
వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో నీరందని – బిజినేపల్లి మండలంలోని లట్టపల్లి, గంగారం, శాయిన్ పల్లి, మమ్మాయపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు వెంటనే మార్కండేయ లిఫ్టు, ఘణపురం మండలం జంగమాయపల్లి, పామిరెడ్డిపల్లి, రుక్కన్నపల్లి, 15 తాండాలకు సాగునీరు అందించేందుకు కర్నెతాండ లిఫ్టు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు. బుద్దారం ఎడమకాలువ తో తాడిపర్తి చెరువు నింపి అక్కడి నుండి నర్సింగాయపల్లి, అచ్యుతాపరం, రాజనగరం ప్రాంతాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. కేఎల్ఐ రిజర్వాయర్ కింద ఆన్ లైన్ రిజర్వాయర్లు వెంటనే చేపట్టాలని కోరారు మంత్రి.కల్వకుర్తి ఎత్తిపోతల కాలువ సామర్ధ్యం కేవలం లక్షా 80 వేలకు మాత్రమే డిజైన్ చేశారు. దానికింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఉన్న కాలువతో అన్ని ఎకరాలకు నీరందించడం సాధ్యం కానందున ఏదుల రిజర్వాయర్ నుండి బుద్దారం అటు నుండి ఘణపురంకు లింకు ఇవ్వాలని మంత్రి నిరంజన్ రెడ్డి నిర్ణయించారు. వనపర్తి జిల్లాలోని డీ8 3 కింద mj3, mj4 కాలువలు వెంటనే పూర్తిచేయాలని మంత్రి అధికారులను కోరారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా లోని ప్రతి నియోజకవర్గంలో సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి లు ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ధేశించిన విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఏకరాకు సాగునీరు అందేవిధంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు.

About The Author