రాం జెఠ్మలాని కన్నుమూత…. నింగికేగిన న్యాయ ధృవతార…


ప్రముఖ న్యాయవాది రామ్‌ జఠ్మలానీ(95) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఎన్నో కీలక కేసులను ఈయన డీల్ చేశారు. అరుణ్‌ జైట్లీ-కేజ్రీవాల్‌ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌ తరఫున వాదించారు. సుప్రీంలో ఎన్నో వివాదాస్పద కేసులనూ ఈయన వాదించారు. వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.

దేశంలో పేరెన్నిక గల న్యాయవాదుల్లో ఒకరైన జఠ్మలానీ.. 1923 సెప్టెంబరు 14న ముంబయిలో జన్మించారు.
ఈయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగారు.

About The Author