టిటిడి అధీనంలోని అటవీప్రాంతంలో ఎర్ర దుంగలు డంప్ అదుపులో తమిళ స్మగ్లర్
తిరుపతి అలిపిరి, పెరుమాళ్ల పల్లి మార్గంలో ని టి టిడి అధీనంలో ఉన్న అటవీ ప్రాంతంలో భూమిలో దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్ ఒ పివి నరసింహారావు టీమ్ శనివారం రాత్రి నుంచి ఎపి టూరిజం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతం నుంచి కూంబింగ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్మగ్లర్లు దుంగలతో రావడం కనిపించింది. వారు దగ్గరకు వచ్చిన తరువాత వారిపై దాడి చేయడానికి సిద్దపడ్డారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని గమనించి దుంగలను పడవేసి పారిపోయారు. పారిపోయే క్రమంలో ఒక ఎత్తైన గుట్ట ను ఎక్కి సిబ్బందిపై రాళ్లు విసిరారు.వారి దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకో గలిగారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించగా తమిళనాడు తిరువన్నామలై జిల్లా మాటుకొన్నూరుకు చెందిన దురైరాజ్ (45)ను పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో పడవేసిన 12 దుంగలు లభించాయి. పట్టుబడిన స్మగ్లర్ ను విచారించగా టిటిడి అధీనంలో ఉన్న అటవీ వారం రోజుల ముందు వచ్చామని ఎర్ర దుంగలను తీసుకుని వచ్చి ఇసుకలో, వాగులోను, ముళ్ల కంపలలోను కొన్ని దుంగలను దాచి ఉంచాము అన్నారు