పాక్ మంత్రిని ట్విట్టర్ లో ఓ ఆటాడేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్…


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో విఫలమవ్వడంతో ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ మాత్రం భారత్ ను గేలి చేయాలని చూసారు. ఇండియా ఫెయిల్డ్ (“IndiaFailed”) అనే హ్యాష్ ట్యాగ్ తో పాకిస్థాన్ కు చెందిన నెటిజన్లు భారత్ ను ట్రోల్ చేయాలని చూసారు. దీంతో భారత నెటిజన్లు వారికి సరైనరీతిలో సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకూ అంతరిక్ష రంగంలో పాకిస్థాన్ సాధించిన విషయాలు ఏమిటో చెప్పాలని భారతీయులు పాకిస్థాన్ ను ప్రశ్నించారు. పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ తన ట్విట్టర్ ఖాతాలో ‘అయ్యో.. పని చేయడం తెలియకుండానే ఎలా సాధించాలని అనుకున్నారో.. డియర్ ఎండియా’ అంటూ ట్వీట్లు చేశారు. (Awwwww….. Jo kaam ata nai panga nai leitay na….. Dear “Endia”)

ఇతడి ట్వీట్స్ పై పలువురు ప్రముఖులు స్పందించారు వారిలో టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. కనీసం బేసిక్ నాలెడ్జ్ లేని నువ్వు ఎలా మంత్రివి అయ్యావు బుజ్జీ అంటూ పంచుల మీద పంచ్ లు వేశారు సాయి ధరమ్ తేజ్. టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ చేసిన ట్వీట్స్ లో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ని కూడా సాయి ధరమ్ తేజ్ బట్టబయలు చేశారు. ఇవే రాని నువ్వు ఎలా టెక్నాలజీ మినిస్టర్ అయ్యావో నీకే తెలియాలి అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. మీరు ఇంకా అంతరిక్షం లోకి ఎలా వెళ్ళాలా అన్న డ్రీమ్స్ లోనే ఉన్నారురా చిట్టీ అంటూ ఓ ఆటాడేసుకున్నారు. కడుపుమంట తగ్గిందా చిట్టీ అంటూ కొన్ని జిఫ్ ఇమేజెస్ ను కూడా అప్లోడ్ చేశారు సాయి.

About The Author