టాస్క్ ఫోర్స్ అమర వీరుల దినోత్సవం
తిరుపతి: తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయం లో బుధవారం జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవం ఘనంగా జరిపారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ నేతృత్వంలో ఎర్ర చందనం స్మగ్లర్లు దాడిలో మరణించిన అటవీ అధికారులు డేవిడ్, కరుణాకరన్ లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ మాట్లాడుతూ విధి నిర్వహణ లో అసువులు బాసిన అమర వీరులకు నివాళులు అర్పించడం మన కర్తవ్యం అని తెలిపారు. ఎర్ర చందనం స్మగ్లర్లు చేసిన దాడిలో కరుణాకర్, డేవిడ్ లు మరణించారని తెలిపారు.
ఎపి అటవీ శాఖకు చెందిన 15 మంది ఇప్పటి వరకు మరణించారని తెలిపారు. అమర వీరుల దినోత్సవం 1730 నుంచి జరుపుతున్నారని చెప్పారు.అప్పట్లో అటవీ ప్రాంతం సంరక్షిస్తూ 360 మంది మరణించారని అన్నారు. ఎసిఎఫ్ కృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధి నిర్వహణ సరిగ్గా చేయడమే అమరవీరులకు సరైన నివాళి అని అన్నారు. దీనికి ముందు అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం చేపట్టారు. ఈ కార్యక్రమం లో డీఎస్పీలు అల్లా బక్ష్, వెంకటయ్య, సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ లు మురళీ, చెందు, ఆర్ ఎస్ ఐ లు విజయ్, వాసు, లింగాధర్, సిసి సత్యనారాయణ, అటవీ అధికారులు ప్రసాద్, నరసింహ