కుషాయిగూడలో జ్యూవెలరి దుకాణంలో చోరీ…
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
సెప్టెంబర్ 4వ తేదీన కుషాయిగూడలో జ్యూవెలరి దుకాణంలో చోరీ జరిగింది.
షాప్ లోని వెండి అంతా చోరికి గురైంది..ఎమెర్జెన్సీ అలర్ట్ అయ్యారు.
తెల్లవారు జామున జరిగిన చోరీ 150 కిలోల వెండి అపహరించారు దొంగలు.
పోలీసుల సీన్ పరిశీలనలో బ్యాగ్ ద్వారా ముఖ్యమైన క్లూ లభించింది.
బ్యాగ్ ద్వారా బీహార్ గ్యాంగ్ చోరికి పాల్పడ్డాడట్టు అంచనాకు వచ్చాము.
బీహార్ రాష్ట్రంలో అరారి గ్యాంగ్ చోరికి పాల్పడట్టు గుర్తించాము.
చోరీ తరువాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్ వెళ్లిన గ్యాంగ్.
గ్యాంగ్ కోసం పాట్నా, బీహార్ లో గ్యాంగ్ గాలింపు మొదలు పెట్టాము.
రన్నింగ్ ట్రైన్ లో పట్టుకునేందుకు ప్లాన్ చేసాము..ధానాపూర్ రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ అని పట్టుకున్నాము.
గ్యాంగ్ కి బాబ్లీ మహుమ్మద్ అనే వ్యక్తి లీడర్ గా ఉన్నారు..ఇతని పై గతంలో హత్య కేసుతో పాటు అనేక కేసులు ఉన్నాయి.
11 లక్షల 49 వేలు నగదు..11 తులాల బంగారం, పలు చోరికి యూస్ చేసిన వస్తువులు స్వాధీనం.
ఈ గ్యాంగ్ కిసరా లో ఒక చోరికి పాల్పడ్డారు..గ్యాంగ్ లో 6 గురిని అరెస్ట్ చేసాము.
అంతర్రాష్ట్ర దొంగలను కేవలం 24 గంటల్లో పట్టుకున్నాము..ఇది మొదటి కేస్ ఇలా పట్టుకోవడం.
హైదరాబాద్ వచ్చే ముందు కర్నాటక, గోవా లో తిరగేసి వచ్చారు.
జ్యూవెలరి షాప్ ఓనర్ సెక్యూరిటీ విధానం వల్ల కేసు తొందరగా ఛేదించేందుకు ఉపయోగపడింది.
కేసులో బీహార్ పోలీస్ సహకారం చాలా ఉంది వారందరికీ ధన్యవాదాలు
పలువురు పోలీసులకు రీవర్డ్ అందించిన సీపీ మహేష్ భగవత్.