ట్విట్టర్ లో నారా లోకేష్…


జగన్ గారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?

మీ వైఫల్యాలని విమర్శించినంత మాత్రాన తెదేపా వాళ్ళను అరెస్ట్ చేసిన పోలీసు వ్యవస్థ మీ వైసీపీ వాళ్ళకు మాత్రం చుట్టం అయిపోయిందా? లేక మీ పార్టీనే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తోందా? మాజీ ముఖ్యమంత్రిని అవమానకరంగా మార్ఫింగ్ చేసిన వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి.

కాదు ఇదే భావప్రకటనా స్వేఛ్చ అంటే అది తెదేపా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. తెదేపా వాళ్ళ మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకుని వాళ్ళకు బహిరంగంగా క్షమాపణ చెప్తారా? @AndhraPradeshCM #DGPAP అలాగే గౌరవ హోమ్ మంత్రి సుచరితగారు దీనికి ఏమని సమాధానం చెప్తారు?

About The Author