పితృదేవతల ఆహారాన్ని కాకి ముట్టుకుంటే వారికి చేరుతుందా..?
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే ” సంభవామి యుగే యుగే “ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం
ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరకాండలో సవివరంగా వివరింపబడి వుంది.
రావణాసురుడు తన అన్నగారైన కుబేరుని
యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పకవిమానం ఎక్కి ప్రపంచం అంతా చుడుతూ
ఒకసారి ఉశీరబీజ దేశమునకు చేరగా
అక్కడ మరుత్తుడను మహారాజు దేవతలతో కూడి యజ్ఞం చేస్తూ కనబడ్డాడు.
అక్కడకు అతడు వస్తున్నప్పుడు గమనించి దేవతలు అందరూ పశుపక్షులుగా మారి పారిపోయారు.
ఇంద్రుడు నెమలిగాను,
యమధర్మరాజు కాకి గాను,
కుబేరుడు తొండగాను,
వరుణుడు హంసగా
మారి పలాయనం చిత్తగించారు.
రావణుడు అపవిత్రమైన కుక్కలాగా ఆ యజ్ఞశాలలో ప్రవేశించి మరుత్తు మహారాజును తాను కుబేరుని తమ్ముడనని,
అతడిని ఓడించి పుష్పకం గెలిచానని పరిహాసంగా మాట్లాడుతూ యుద్ధానికి రమ్మని కవ్వించాడు.
ఆ మరుత్తు మహారాజు యుద్ధానికి సన్నద్ధుడు అవుతుండగా ఆ యజ్ఞహోత బృహస్పతి తమ్ముడు అయిన సంవర్థ మహర్షి అది పరమేశ్వర ప్రీతీ కోసం చేస్తున్న యాగమని,
మధ్యలో ఆపితే అది వంశనాశనం అని వారిస్తాడు. అతడు యుద్ధప్రయత్నాన్ని విరమించి యాగానికి సిద్ధపడతాడు.
రాజు ఓడిపోయాడు అని రావణుడు ప్రకటించుకుని అక్కడున్న ఎంతో మంది మహర్షులను తన రాక్షస సపరివారంగా భుజించి వెళ్ళిపోయాడు.
రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట ఇంద్రాదిదేవతలు
ఆ రూపాలను త్యజించి వారి వారి రూపాలలో వచ్చారు.
అప్పుడు ఇంద్రుడు మయూరాన్ని చూసి మీ జాతికి సర్పముల వలన భయం ఉండదనీ,
ఇంద్రుని వలే ఆ నెమలి పించ్హానికి వేయి కన్నులు ఉంటాయని
తాను మేఘరూపంలో వర్షిస్తుంటే అందంతో పొంగి పించాన్ని విప్పి ఆడుతుందని వరం ప్రసాదిస్తాడు.
అంతకు ముందు కేవలం నీలంగా ఉన్న ఆ పించం అప్పటినుండి ఇంద్రప్రభావం వలన కన్నులతో అందంగా కనబడడం మొదలయ్యాయి.
తరువాత యమధర్మరాజు కాకితో ఇట్లా అన్నారు:
” ఓ వాయసమా నీ రూపం ధరించి నేను హాయిగా ఉన్నాను.
నీకు ఏ రోగాలు ఉండవని వరం ప్రసాదిస్తున్నాను.
మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలోస్తాయి
కానీ నీకు ఏ రోగాలు అంటవు.
నా లోకములో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు.
భూతలంలో ఉన్న వారి సంతానం నీకు ఆహారం ఇచ్చి తృప్తి పరచినచో వారియొక్క పితృదేవతల యొక్క క్షుత్పిపాసలు తీరుతాయి” అని వరం ఇచ్చారు.
అందుకే పిండప్రదానం చేసిన తర్వాత ఆ పిండాలు కాకులు ముట్టాలని అందరూ ఆశిస్తారు.
తద్దినం నాడు కాకిని ఉద్దేశించి పెట్టే పిండాన్ని
వికిర పిండం అంటారు.
దీనికి ఎవరిని ఉద్దేశించి తద్దినం పెట్టబడిందో వారికి
ఏ సంబందము లేదు.
ఆ కులంలో అగ్ని దగ్ధులు అనగ్ని దగ్ధులు ఎవరైనా ఉండి ఉంటే కనక అలాంటి వారికి ఉద్దేశించి పెట్టబడేదే వికిర పిండము.
మంత్రంలో పైన చెప్పబడిన వారిని ఉద్దేశించి పెడుతున్నట్లు స్పష్టంగా చెబుతారు.
కాని సంస్కృతం రాకపోవడం వల్ల భావం తెలియని వారెవరో చెప్పినది అదొక మహత్తరమైన విషయంగా కొనసాగి పోతోంది.
యే అగ్ని దగ్ధా యేనగ్నిదగ్ధా యే వా జాతాః కులే మమ ।
భూమౌ దత్తేన పిణ్డేన తృప్తాయాన్తు పరాఙ్గతిమ్।
అగ్ని దగ్ధేభ్యః అనగ్పి దగ్ధేభ్యః అస్మత్కుల
ప్రసూత మృతేభ్యః ఏష పిణ్డః ఉపతిష్ఠతు.
ఇది వికిర పిండం విడిచే ముందు చదివే మంత్రం.
దీన్ని అనుసరించి ఆ కాకికి పెట్టే పిండం తద్దినం పెడుతున్న కర్త కులంలోని అగ్నిదగ్ధులు,అనగ్నిదగ్ధుల్ని మాత్రమే ఉద్దేశించినది.
కొన్ని గ్రంథాల్లో లేదా పంథాలలో ఈ మంత్రానికి మరొక్క అడుగు ముందుకు వేసి ఒక్క కులంలో మాత్రమే కాదు మన దగ్గర పనిచేసిన భృత్యులకు కూడా ఆ వికిర పిండం చెందుతుంది అని .
అంటే సనాతన ధర్మం కుల మతాలకు అతీతంగా భృత్యులను కూడా పితృ దేవతలలో కలిపింది.
ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంటిలో ఎప్పుడో పనిచేసి అకాల మృతి పొందిన వారు కాకి రూపంలో భోజనం చేస్తే కానీ మనం భోజనం చేయకూడదు అనే అంత గొప్ప సంస్కారం సనాతన ధర్మం మాత్రమే నేర్పినది.
అది అర్థం కానివారికి తద్దినం పెట్టిన వారి పేరు చెప్పి
కథలా అలవాటు చేసేసారు.
అనాదిగా వున్న వేద మంత్రాలులో కూడా కుల మత భేదాలు లేకుండా ఆచారాలు తయారు చేయబడ్డాయి. ఎప్పుడో పోయిన వారికే ఇంత ప్రాధాన్యత ఇస్తే
మన కళ్ళెదుట వున్న వారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అదే జరిగి వుంటే ఈ కుల మతాల గొడవలే వుండేవి కాదు.
అంటే సనాతన ధర్మం అవగాహన లేక కర్మ సిద్ధాంతం మాత్రమే గుడ్డిగా అవలంబించటం వలన ఏర్పడిన వికారమే ప్రస్తుతం మనం చూస్తున్న వర్ణ వివక్ష అని అభిప్రాయం.
ఓం నమః శివాయ