పిచ్చికుక్క దాడి విషపు ఘాటు కోరల్లో పోరాడి ప్రాణాలు వదిలిన చిట్టితల్లి గ్రేస్ పుష్ప…


పిచ్చికుక్క దాడి విషపు ఘాటు కోరల్లో నుండి 26 రోజులుగా పోరాడి ప్రాణాలు వదిలిన చిట్టితల్లి గ్రేస్ పుష్ప

బంగారు తల్లి గ్రేస్ పుష్ప
మారణ వార్త తో ఒట్టిగడ్డలో విషాదఛాయలు అలుముకున్నాయి

తూర్పుగోదావరి జిల్లా , ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ ,
రాజవొమ్మంగి మండలం తంటికొండ గ్రామపంచాయతీ పరిధిలోని ఒట్టిగెడ్డ గ్రామానికి చెందిన పల్లి గ్రేస్ పుష్ప (5) అనే ఐదేళ్ళ బాలికపై పిచ్చి కుక్క దాడి చేసిన ఘటనా గత ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖున జరిగింది .

ఘటన జరిగిన వెంటనే కాకినాడ జీజీహెచ్ కు అంబులెన్స్ లో తరలించారు .

ఆ రోజు నుండి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్న గ్రేస్ పుష్ప ను
ఆగస్టు 29న తల్లిదండ్రులు ఇంటికి తీసుకుని వచ్చారు .

వైద్యుల సలహా మేరకు ఈ నెల తొమ్మిదో తారీఖున మరోసారి కాకినాడ జీజీహెచ్ కు వెళ్లాగా . చికిత్స అందించిన వైద్యులు మరోసారి ఈనెల 18 న మరోమారు రావాలని తెలియజేయడంతో ఇంటికి వచ్చేసారు .

పిచ్చి కుక్క దాడి విషపు వలయంలో కొన్ని రోజులుగా తల్లడిల్లిన అ చిట్టితల్లి గ్రేస్ పుష్ప ను మాత్రం మృత్యువు వదలలేదు వెంటాడుతూనే ఉంది , అ పిచ్చికుక్క విషపు కోరల నుండి ఆ బంగారు తల్లి తప్పించుకోలేకపోయింది .

అ భగవంతుడు కూడా నిలువెత్తు బంగారం లాంటి బాలిక గ్రేస్ పుష్ప ను కాపడలేకపోయాడు .

ఆ వైద్యులు బాలికను పిచ్చికుక్క దాడి చేసిన గాయలను నయం చేయాలనే తపనతో వైద్యలు అందించిన వైద్యం , వారు పడ్డ కష్టం , తల్లిదండ్రులు రోదనలు చిన్నారి ఆదివారం ఉదయం మృతి తో వారి ఆశలు అడియాసలు ఐయ్యాయి .

చిన్నారి మృతి వార్త తెలుసుకున్న రాజవొమ్మంగి మండలం లోని యావత్ ప్రజల హృదయలు తల్లడిల్లిపోతున్నాయి .

గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా పిచ్చికుక్కలు వీరంగం సృష్టిస్తు ప్రజలపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నాయి అని , వందలాది సార్లు గ్రామపంచాయతీ అధికారులకు , మండల అధికారులకు పిర్యాదులు చేసిన వారి నుండి ఎటువంటి స్పందన లభించడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ఒక్క ఒట్టిగడ్డ గ్రామంలోనే కాదు రాజవొమ్మంగి మండలం లోని పంతొమ్మిది గ్రామపంచాయతీలలోని కూడా ఇదే పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు .

పిచ్చికుక్కల దాడిలో ప్రాణం పోయిన గ్రేస్ పుష్ప ప్రాణాలను ఎలాగూ వెనక్కి తీసుకోరాలేము , మరొకరికి ఇటువంటి ఘటన భారిన పడకుండా ఉండేందుకు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా పిచ్చి కుక్కలు , ఊర కుక్కలు గ్రామాల్లో స్వైర విహారం చేయకుండా వాటి నిర్ములనకు తగు చర్యలు చేపట్టాలని రాజవొమ్మంగి మండలం లోని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ..
..

About The Author