మహిళ హారతిస్తుండగా మంగళసూత్రం, మింగేసిన ఎద్దు
ముంబై: దాదాపు లక్షన్నర రూపాయల విలువైన మంగళసూత్రాన్ని ఓ ఎద్దు మింగేసింది. ఈ ఉదంతం మహారాష్ట్రాలోని రైతీ వాఘాపూర్ గ్రామంలో జరిగింది. మహారాష్ట్రలోని రైతాంగం ప్రతి ఏటా ఆగస్టు 30న బైల్ పూలా అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఎద్దులను అలంకరించి..వాటికి పూజ చేస్తారు.
ఈ నేపథ్యంలో సదరు గ్రామంలోని ఓ మహిళ కూడా తమ జోడెడ్లకు పూజచేసింది. తరువాత హారతిచ్చింది. అనంతరం తన మంగళసూత్రాన్ని హారతిపళ్లెంలో ఉంచి..ఎద్దుకు తాకించించింది. తదుపరి..ప్రత్యేకంగా తయారు చేసిన చపాతీలను హారతి పళ్లెంలో పెట్టి ఎడ్ల ముందుంచింది. యథాప్రకారం అవి చపాతీలను తిన సాగాయి. ఇంతలో అనుకోకుండా కరెంటు పోవడంతో..కొవ్వొత్తి తెచ్చేందుకు సదరు మహిళ వంటింట్లోకి వెళ్లింది. ఆ సమయంలో హారతి పళ్లాన్ని అక్కడే వదిలేసింది.
తిరిగి వచ్చి చూసేసరికి పళ్లెంలోని మంగళసూత్రం కినిపించలేదు. రెండు ఎడ్లలో ఎదో ఒకటి మంగళసూత్రాన్ని తినేసి ఉండచ్చొన భావించిన మహిళ ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది. ఎదో ఒకరోజు ఎద్దు పేడలో అది బయటకు వస్తుందిన భావించిన వారు.. ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూడసాగారు. రోజులు గడుస్తున్నా వారు అనుకున్నది మాత్రం అవటంలేదు. దీంతో జ్ దంపతులు రెండు రోజుల క్రితం ఎడ్లను వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. మెటల్ డిటెక్టర్ ద్వారా ఎద్దు కడుపులోనే మంగళసూత్రం ఉందని నిర్ధారించిన డాక్టర్..దానికి ఆపరేషన్ చేసి మంగళసూత్రాన్ని వెలికితీశారు.