కోడెలది ఆత్మహత్య కాదు… హత్య చేసింది కన్నకొడుకే….?

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై అంతకంతకూ సందిగ్ధత పెరుగుతూనే ఉంది. కోడెల మేనమామ కుమారుడు, వరుసకు బావ అయిన కంచేటి సాయి ఇది ఆత్మహత్యకాదు… కన్నకొడుకు శివారాం చేసిన హత్య అంటూ…సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేవిషయమై సత్తెనపల్లి డీఎస్పీకి తన స్వదస్తూరితో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఆస్తి కోసం కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని కంచేటి సాయి ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడెల గతంలో తనకు అనేక పర్యాయాలు ఫోన్ చేసేవారని లేఖలో పేర్కొన్నారు కంచేటి సాయి.

కన్న తండ్రిని బాధపెట్టడం తగదని, తాను కూడా పలుసార్లు శివరామ్‌కు సూచించానని అన్నారు. కోడెలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని లేఖలో డిమాండ్ చేసారు సాయి.

About The Author