గోదావరి బోటు ప్రమాదంపై సీఎం జగన్ నిజాయితీ…

గోదావరిలో బోటు ప్రమాదం పై ముఖ్యమంత్రి జగన్ నిజాయితీగా మాట్లాడారనిపిస్తుంది. ప్రభుత్వమే ఈ ఘటనకు బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. టూరిజం బోట్లు వరద ఉధృతి కారణంగా ఆగిపోతే ప్రైవేటు బోట్లు ఎందుకు ఆగలేదని, పోలీసులు, అధికారులు ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన బోటు ప్రమాదంపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ‘ఇంతమంది ప్రాణాలు పోయాయంటే కారణం ఎవరు? మన అలసత్వం కారణంగానే ఇది జరిగింది. బాధితులను చూసినప్పుడు గుండె చెరువైంది. కుటుంబాలకు కుటుంబాలే కోల్పోయారు. మనమంతా ఏం చేస్తున్నాం అనిపిస్తోంది. ఆపగలిగే పరిస్థితిలో ఉన్నా బోటును ఆపలేకపోయారు’ అని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
