వైఎస్సార్ కంటి వెలుగు కింద 5.3 కోట్ల మందికి కంటి పరీక్షలు
వైఎస్సార్ కంటి వెలుగు కింద 5.3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆరు విడతలుగా ఈ కార్యక్రమం నిర్వహించాలని, 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటికి సంబంధింన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ. 560కోట్లతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని సీఎం తెలిపారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్రచికిత్స, ఇతర కార్యక్రమాలన్నీ వైయస్సార్ కంటి వెలుగు కింద నిర్వహిస్తామన్నారు. పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రూ.43లు రోజులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు రోజుకు రూ.18 అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం జగన్ తెలిపారు.