బోటు ప్రమాదంలో గల్లంతయిన హాసిని మృతదేహం వెలికితీత

 

తిరుపతి వినాయక సాగర్ సమీపంలోని అపార్ట్మెంట్కు చేరుకున్న హాసిని మృతదేహం.   కన్నీటి పర్యంతం అవుతున్న తల్లి… బంధువులు… చిన్నారికి చూడటానికి హాజరైన విద్యార్థులు..చిన్నారికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి .

 

తిరుపతి: సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో  చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు.పుణ్యనది గోదావరిలో తండ్రి అస్థికలను నిమజ్జనం చేసి, ఆఖరి క్రతువును నిర్వహించి, తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించాలని వెళ్లిన తిరుపతికి చెందిన సుబ్ర మణ్యం కుటుంబానికి అంతులేని దుఃఖమే మిగిలింది. బోటు మునక ప్రమాదంలో ఆయన తన కుమార్తె హాసినితో పాటు గల్లంతు అవాగ ఆయన భార్య మధులత ప్రమాదం నుంచి బైటపడటం విదితమే. హాసిని మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు.  తిరుపతిలో కుటుంబంతో కలిసి వినాయకసాగర్‌ రాధేశ్యామ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నా రు. సుబ్రమణ్యం (45)కు శ్రీకాళహస్తి, చిత్తూరులో పెట్రోల్‌ బంకులున్నాయి. శ్రీకాళహస్తి  పెట్రోల్‌ బంకు బాధ్యతలను ఆయన సతీమణి మధులత చూసేది. హాసిని (12) తిరుపతి స్ప్రింగ్‌డేల్‌ స్కూలులో 7వ తరగతి చదువుతోం ది.

About The Author