పేపరు పట్టే.. ర్యాంకు కొట్టే…


క్వ‘చ్ఛీ’న్‌ పేపర్‌

ఉద్యోగార్థులు రాసే పరీక్షలను ఉద్యోగులు రాశారు. ఆ పరీక్ష పేపర్లు సిద్ధంచేసిన ఏపీపీఎస్సీలోనే వారు పనిచేస్తున్నారు. అంతేకాదు పేపర్లు తయారుచేసిన విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు ఈ పరీక్షలకు హాజరయ్యారు. గురువారం విడుదలచేసిన సచివాలయ ఫలితాల్లో కేటగిరి-1లో టాప్‌ 1 ర్యాంకరు ఆమే!
వారంతా ఏపీపీఎస్సీ ఉద్యోగులు! ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో జరిగిన పరీక్ష ఫలితాల్లో వారిలో కొందరు బంధువులు టాప్‌ టెన్‌లో అదరగొట్టారు!
ఇంట్లో అందరూ టీచర్లే! కుటుంబమంతా వైద్యులే! అనే మాటలు వింటుంటాం. అలాగే, ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి ఇంట్లో దాదాపు అందరూ గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత సాధించారు. ఆయన భార్య కాకుండా ఇంట్లో మరో ఇద్దరు మంచి ర్యాంకులు తెచ్చుకొన్నారు.
తిలాపాపం తలాపిడికెడు! పేపరు సంపాదించిన ఏపీపీఎస్సీలోని కొందరు ఉద్యోగులు.. దానిని గుట్టుగా ఉంచలేదు. బంధువులు, సన్నిహితులకూ లీక్‌ చే శారు.
పేపర్‌ టఫ్‌! ఐఏఎస్‌లకు ఇవ్వాల్సిన పేపరు అది!
50 శాతం మార్కులు వస్తే ఎక్కువన్నది పలువురి మాట! అలాంటి పేపరులో టాప్‌ స్కోరు 112.
పరీక్ష పేపరు తయారుచేసింది ఏపీపీఎస్సీ. ఆ పేపరు ఆధారంగా పరీక్ష నిర్వహించిందీ కమిషనే. కానీ, పేపరు తయారీకి, పరీక్ష నిర్వహణకు మధ్యలో ప్రశ్నపత్రం ఓ రిటైర్డు అధికారి చేతికి పోయింది. ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇలా ‘బయటి కన్ను’ ప్రశ్నపత్రంపై పడటం ఇదే తొలిసారి!
పేపరు టైపిస్టే టాపరు?

అనితమ్మ కేటగిరి-1లో టాప్‌ ర్యాంకర్‌. ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే విభాగంలో అనితమ్మ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో జూనియర్‌ అసిస్టెంట్‌. ప్రశ్నపత్రం టైప్‌ చేసిందీ ఆమేనని కమిషన్‌ వర్గాలే అంటున్నాయి!

బంధువంటే ఇలా…

దొడ్డా వెంకట్రామిరెడ్డి కేటగిరి-3లో ఫస్ట్‌ ర్యాంకరు, .కేటగిరి-1లో మూడో ర్యాంకరు. ఆయన సొంత అన్న ఏపీపీఎస్సీలో ఏఎస్‌వో.

సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ!
ఆ పేపరు టైప్‌ చేసిన ఉద్యోగినే టాపరు!
ఏపీపీఎస్సీ కేంద్రంగా సాఫీగా వ్యవహారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టాపర్లలో
అక్కడి ఉద్యోగులూ, వారి బంధువులూ
ఓ ఉద్యోగికి కేటగిరి-3లో రెండో ర్యాంకు
ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగినికి టెన్త్‌ ర్యాంకు
ఓ ఉద్యోగి భార్య సహా ముగ్గురికి ర్యాంకు
అన్న ఉద్యోగి.. తమ్ముడు టాప్‌ ర్యాంకర్‌
రెండు కేటగిరీల్లోనూ ఫస్ట్‌, థర్డ్‌ ర్యాంకు
జిల్లాల్లోని తమవారికీ పేపర్‌ అందజేత
సర్వీసు కమిషన్‌ విశ్వసనీయత గోదాట్లో
ఏపీపీఎస్సీపై తొలినుంచీ సందేహాలే
‘తమ’వారికే ఇచ్చుకొనేలా గూడుపుఠాణి
చేస్తున్నట్టు అనుమానించిన అభ్యర్థులు

About The Author