వాట్సప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది…
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. మరో కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది వాట్సప్. ఇటీవల కాలంలో వాట్సప్ అనేక ఫీచర్స్‌ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది యూజర్లు తమ వాట్సప్‌ను మరింత సౌకర్యవంతంగా వాడుకునేందుకు ఉపయోగపడుతున్న ఫీచర్లు ఇవి. సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు చేస్తూ సరికొత్త ఫీచర్స్‌ని అందిస్తోంది వాట్సప్. ఇప్పుడు మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ యూజర్లలో చాలామంది స్టేటస్ ఫీచర్‌ని వాడుకుంటున్న విషయం తెలిసిందే. వాట్సప్ నుంచి వచ్చిన బెస్ట్ ఫీచర్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే ఎవరి స్టేటస్లైనా నచ్చక పోతే మ్యూట్ ఆప్షన్ ద్వారా వాటిని లిస్ట్‌లో కనిపించకుండా చేయొచ్చు. ఇక మీకు నచ్చని స్టేటస్లు చూడాల్సిన అవసరం లేదు. మీరు శాశ్వతంగా హైడ్ చేసిన స్టేటస్‌ని భవిష్యత్తులో ఎప్పుడైనా చూడాలనుకుంటే షో ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఎవరి స్టేటస్కైనా మ్యూట్ ఆప్షన్ ఆన్ చేస్తే ఆ స్టేటస్ లిస్ట్‌లో చివర్లోకి వెళ్లిపోతుంది. స్టేటస్ లిస్ట్‌లో ఉండదు. అయితే చివర్లో మ్యూట్ అప్డేట్స్లో కనిపిస్తుంది. అదే మీరు హైడ్ మ్యూట్ స్టేటస్ అప్డేట్స్ ఫీచర్ ఆన్ చేస్తే స్టేటస్‌ని పూర్తిగా హైడ్ చేయొచ్చు. అంటే మీ కాంటాక్ట్‌లో ఎవరి స్టేటస్ అయినా నచ్చకపోతే పూర్తిగా హైడ్ చేయొచ్చు. ఆ తర్వాత వారి స్టేటస్లు మీకు కనిపించవు. వాట్సప్ బీటా 2.19.260 ఆండ్రాయిడ్ వర్షన్లో హైడ్ మ్యూట్ స్టేటస్ అప్డేట్స్ ఫీచర్ ఉంటుంది. మీరు మీ వాట్సప్ అప్డేట్ చేసిన తర్వాత 2.19.260 ఆండ్రాయిడ్ వర్షన్‌కి అప్డేట్ అయితే ఈ ఫీచర్ వాడుకోవచ్చు.