తిరుమల కొండపైన కాలుష్య నివారణ చర్యలు…
తిరుమల కొండపైన కాలుష్య నివారణకు త్వరలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆద్వర్యంలో 150 నుండి 200 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించేందు కు చర్యలు చేపడు తున్న ట్లు రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య పేర్కొ
న్నారు.
శుక్రవారం ఉదయం వాహన మండపం వద్ద మచిలీపట్నం మాజీ ఎం.పి బాడిగ రామ కృష్ణ 6 లక్షల విలువైన 2 ట న్నులు కెపాసిటీ గల ఎలక్ట్రి కల్ వాహనాన్ని శ్రీవారి సేవ కు విరాళంగా ఇచ్చే కార్య క్రమంలో భాగంగా అందుకు సంబందించిన రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి చేతుల మీదుగా టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి గారికి అందజేశారు.
అనంతరం మంత్రి విలేఖరు లతో మాట్లాడుతూ మాజీ ఎంపీ శ్రీవారి సేవకు వాహనా న్ని విరాళం ఇవ్వడం సంతో షం అన్నారు. తిరుమల కొండ పైన కాలుష్య నివా రణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 150 నుండి 200 ఎలక్ట్రికల్ బస్సులను నడిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా తిరు మల కొండపైన పొల్ల్యూషన్ ఫ్రీగా చేయుటకు అవకాశం ఉంటుందన్నారు.
టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బా రెడ్డి మాట్లాడుతూ స్వామి వారి సేవకు 6 లక్షల రూపా యలు విలువచేసే టాటా ఇన్ఫ్రా వాహనాన్ని మంత్రి పేర్ని నాని ఆద్వర్యంలో వాహనానికి సంబందించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పూర్తి స్థాయిలో అందజేశారని, శ్రీవారి సేవకు విరాళంగా వాహనాన్ని ఇచ్చిన వారికి శ్రీవారి ఆశీసులు ఎల్లపుడూ ఉంటుందని ఆశిస్తూ వారికి దన్యావాధాలు తెలిపారు.
ఈ కార్యక్రమం అనంతరం మంత్రిని ఛైర్మన్ ఆఫీసు లో శాలువాతో సత్కరించి ప్రసా దాలను అందించారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు పాల్గొన్నారు.