గ్రీన్‌ టీ … దాని నిజాలు…


గ్రీన్‌ టీ తాగితే ఆందోళన తగ్గిపోయి, ప్రశాంతత చేకూరుతుందని చాలామంది భావిస్తుంటారు. దీనికి కారణం గ్రీన్‌ టీలోని ఎల్‌-థియానైన్‌ అనే ప్రత్యేక అమైనో ఆమ్లమే. ఇందులో ఎపీగ్యాలోక్యాటెచిన్‌ గాలేట్‌ (ఈజీసీజీ) అనే ఫ్లేవనాల్‌ ఉంటుంది. ఇది మెదడుకు హానికర పదార్థాలు చేరకుండా అడ్డుకునే వ్యవస్థను సైతం దాటుకొని వెళ్లి ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది. థియానైన్‌ మెదడులో అల్ఫా తరంగాల ఉత్పత్తినీ ప్రేరేపించి ప్రశాంత స్థితి కలిగేలా చేస్తుంది. ధ్యానం మాదిరిగా మానసిక చురుకుదనాన్నీ కలిగిస్తుంది. మానసికోల్లాసానికి తోడ్పడే డోపమైన్‌, సెరటోనిన్‌ రసాయనాల స్థాయులను నియంత్రించే గామా అమైనో బ్యుటీరిక్‌ ఆమ్లం ఉత్పత్తిలోనూ థియానైన్‌ పాలు పంచుకుంటుంది.

About The Author