75 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదు : కేటీఆర్.

 

75 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పురపాలక,మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 76 గజాల నుండి 600 గజాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే వాళ్లు అన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.ఇక అన్‌లైన్‌లో అనుమతి కోరేవారికి నిబంధల ప్రకారం పత్రాలు ఉంటే 21 రోజుల్లో అనుమతులు మంజురూ చేస్తామని చెప్పారు. మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు సంతానం కంటే ఎక్కువా ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని ఆయన తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటిఆర్ శాసనమండలిలో మున్సిపల్ చట్టంపై చర్చ జరిగింది. దీంతో రానున్న నూతన చట్టంపై పలు విషయాలు వెల్లడించారు.

About The Author