రెండు ఎర్ర చందనం దుంగలతో తమిళ స్మగ్లర్ అరెస్టు
చిత్తూరు జిల్లా: పెరుమాళ్లపల్లి బీట్ పరిధిలోని లక్ష్మీపురం చెరువు వద్ద రెండు దుంగలతో ఒక తమిళ స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శ్రీ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ లు అల్లా బక్ష్, వెంకటయ్య సూచనల మేరకు ఆర్ ఎస్ ఐ విజయ్ నరసింహులు, ఎఫ్ బిఒ జానీ బాషా బృందం కల్యాణి డామ్ మీదుగా శేషాచలం అడవుల లో కూంబింగ్ చేపట్టారు. సోమ వారం ఉదయం ఒక వ్యక్తి రెండు ఎర్ర చందనం దుంగలను మోసుకుని వెళుతూ తారస పడ్డాడు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతనిని చుట్టు ముట్టారు. అతనిని తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకా పాదిరి గ్రామానికి చెందిన ఏలుమలై (26) గా గుర్తించారు. ఇతను గతంలో కూడా టాస్క్ ఫోర్స్ కు పట్టుబడ్డాడు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో ఇతని పేరు నమోదు కావడం ఇది రెండవసారి. ఇతనిని విచారించగా తనతో పాటు ఐదుగురు వచ్చారని, వారు వెళ్లిపోయారని తాను దారి తప్పి ఈ మార్గం లో వచ్చినట్లు తెలిపాడు. మిగిలిన వారి కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలిస్తున్నారు. లక్ష్మి పురం చెరువులో ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు ఉండటం ఆ మార్గం లో