భారీ నష్టాల్లో మార్కెట్…


రెండు రోజులు మార్కెట్‌ పెరిగింది.. ఇంకమిటి? ఈ ప్రశ్నకు ఇన్వెస్టర్లకు సమాధానం దొరకడం లేదు. పన్ను తగ్గిస్తే కంపెనీలకు లాభం. లాభం ప్రమోటర్లకు వెళుతుంది. కొత్త పన్నులు తక్కువగా ఉంటే…కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. అది వెంటనే తేలే వ్యవహారం కాదు. సో ఇన్వెస్టర్లలో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలు సరేసరి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇవాళ ఐక్యరాజ్య సమితిలో చైనాతో వాణిజ్యంపై చేసిన వ్యాఖ్యలతో యూరో మార్కెట్లన్నీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం నిఫ్టి స్వల్ప నష్టంతో 11,564 వద్ద ప్రారంభమైంది. ఇదే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి. మిడ్‌ సెషన్‌ తరవాత అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో నిఫ్టి ఒకదశలో 11416 పాయింట్ల కనిష్ఠ స్థాయికి క్షీణించింది. క్లొజింగ్‌లో కాస్త కోలుకుని..11,440 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 148 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ 503 పాయింట్లు క్షీణించింది.
నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌…
పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఐఓసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌
టాప్‌ లూజర్స్‌..
ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, మారుతీ
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌…
సీజీ పవర్‌, ఐడీబీఐ, దీవాన్‌ హౌసింగ్‌, మోన్‌శాంటో, కాకర్డ్‌
టాప్‌ లూజర్స్‌
అరవింద్‌, ఎస్‌బీఐ, మదర్సన్‌ సుమి, శ్రేయ్‌ ఇన్‌ఫ్రా, స్టెర్‌లైట్‌ టెక్నాలజీ

About The Author