కళ్ళల్లో కారం కొట్టి చోరీలకు పాల్పడే ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేసిన నాయుడుపేట పోలీసులు.
నెల్లూరు జిల్లా:జిల్లాలోని నాయుడుపేట టౌన్ లోని ఎల్ఐసి ఆఫీస్ కు ఎదురుగా ఉన్న ఓఇంటిలో రిటైర్డ్ టీచర్ ఒంటరిగా ఉంటుంది.ఆ ఇంటికి ప్రతినిత్యం పాలు ప్యాకెట్ లు సరఫరా చేసే విశ్వాస్ అనే వ్యక్తి ఆమె మెడలోని రూ. 1.30.000 రూపాయిల విలువ చేసే బంగారు నగలను దొంగిలించాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా అతని స్నేహితుడు సాయి సహాయం తీసుకుని ఈ నెల 24వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో మొదటి ముద్దాయి కర్నాటి విశ్వాస్ రోడ్డుపై ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉండగా రెండవ ముద్దాయి సాయి ఇంటి పైకి వెళ్లి తలుపుతట్టగా మహిళ తలుపు తీసింది. అనంతరం సాయి బలవంతంగా లోపలికి వెళ్లి కారం తీసుకొని ఆమె కళ్ళల్లో కొట్టడం జరిగింది.దింతో రిటైర్డ్ టీచర్ లబోదిబోమంటుండగా ఆమె మెడలోని రూ.లక్షా 30 వేల విలువచేసే బంగారు చైన్ ను బలవంతంగా తెంచుకొని పరారయ్యాడు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా గూడూరు డిఎస్పి భూమన భవాని హర్ష పరిశీలించారు. నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి,ఎస్ఐ వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో ముమ్మరంగా గాలించి ఇద్దరు నిందితులను 48 గంటల్లోనే పట్టుకోవటం జరిగింది.చోరీ జరిగిన 48 గంటల్లోనే కేసును ఛేదించడం పట్ల సీఐ వేణుగోపాల్ రెడ్డి,ఎస్ఐ వెంకటేశ్వర రావు,మరియు సిబ్బందిని డిఎస్ పి భూమన భవాని హర్ష ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందచేశారు.ఇద్దరు నిందితుల నుండి చోరీ సొమ్మును రికవరీ చేసిన పోలీసులు.