శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చెన్నకేశవ స్వామి ఆలయంనుండి ప్రారంభమైన శ్రీవారి గొడుగుల ఊరేగింపు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి అలంకరించేందుకు చెన్నై హిందూధర్మార్థ సమితి ఆధ్వర్యంలో తమిళనాడు ర్రాష్ట్రం చెన్నై హైకోర్టు సమీపంలోని పూలబజారు చెన్నకేశవ స్వామి ఆలయంనుండి ప్రారంభమైన శ్రీవారి గొడుగుల ఊరేగింపు. కార్యక్రమాన్ని ప్రారంభించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మరియు స్వతమనందేంద్ర స్వామి.
చెన్నై హిందుదర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్ జీ మరియు మేనేజింగ్ ట్రస్టీ వేదాంతం జీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రీవారి ఊరేగింపులో స్వామివారికి అలంకరించేందుకు గొడుగులను చెన్నై నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలోస్థాన అధికారులకు అందజేయడం జరుగుతోంది.
నేడు చెన్నై పూలబజారు సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయంనుండి 11 గొడుగులకు ప్రత్యేక పూజలు చేసి అక్కడనుండి రహదారులలో నడుచుకుంటూ ఊరేగింపుగా తిరుమలకు నేడు గొడుగులు బయలుదేరింది.
ముందుగా చెన్నకేశవ ఆలయంవద్ద విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మరియు స్వతమనందేంద్ర స్వామి వారు శ్రీవారికి సమర్పించే గొడుగులకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు.