తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు ఆదివారం 29.09.2019 ఉదయం 5 గంటల సమయానికి,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 గదులలో భక్తులు చేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 14గంటలు పట్టవచ్చును
నిన్న స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 2.49 కోట్లు,
నిన్న 32,703.మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
నిన్న 88,320మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా ఆరు. గంటల సమయం పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_
సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి_
ttd Toll free:18004254141