నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు ఇకపై ప్రతి సంవత్సరం జనవరి లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు రాబోయే రోజులలో వివిధ శాఖలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని తెలిపారు
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచి ప్రసక్తేలేదని జనవరి నెలలో సమీపిస్తున్నందున నిరుద్యోగులు అంతా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు విజయవాడలో సచివాలయ ఉద్యోగాల అభ్యర్థులకు నియామక పత్రాలను అందించిన ముఖ్యమంత్రి అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగాల కల్పనలో సరికొత్త రికార్డు సాధించామన్నారు సీఎం జగన్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన ప్రతి ఒక్కరు దీనిని ఉద్యోగం లా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు