నెల్లూరు జిల్లాలో కరుడు కట్టిన నేరస్తులని అరెస్టు చేసిన డిఎస్పి రాఘవరెడ్డి…
నెల్లూరు జిల్లా..
జిల్లాతో పాటు పలు జిల్లాల్లో అనేక కేసులో నిందితులుగా ఉన్న కరుడు కట్టిన నేరస్తులని అరెస్టు చేసిన డిఎస్పి రాఘవరెడ్డి.అండ్ టీమ్.
ఒకటిన్నర కేజీ బంగారం,మూడున్నర కేజీ వెండి స్వాధీనం.
21 కేసులలో చోరీ సొత్తు విలువ 50 లక్షలు.
కేటుగాళ్లు పట్ల సింహస్వప్నంలా మారిన ఎస్పి.
*డీఎస్పీ రాఘవరెడ్డి ని అభినందించిన ఎస్పీ*
ఇటీవల జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాల కేసులు పై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రూరల్ డిఎస్పి కె.వి. రాఘవరెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ రామకృష్ణ,సీసీఎస్ సీఐ బాజీజాన్ సైదా,కలిసి దొంగల కోసం తీవ్రంగా వేట కొనసాగించారు.ఇందులో భాగంగా తిరుపతి స్వామి,లక్ష్మీపతి అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా..కళ్ళు మిరుమిట్లు గొలిపే విధమైన నిజాలు బయటకు వచ్చాయి. ఇందుకూరుపేట,నెల్లూరు రూరల్,బాలాయపల్లి,ఏఎస్.పేట పరిధిలో ఏడు నేరాలు.. ప్రకాశం జిల్లా మేదరమెట్ల కొనగలమిట్ట, జరుగుమల్లి, గుడ్లూరు,సిఎస్.పురం,
లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 6 దొంగతనాలు..గుంటూరు జిల్లాలో పెదనందిపాడు 1.. చిత్తూరు జిల్లాలో తవణంపల్లి, ఏర్పేడు, బంగారుపాలెం, వాయల్పాడు, సోమల, చౌడేపల్లి, ఎస్ఆర్ పురం, పోలీస్ స్టేషన్ పరిధిలో 9 దొంగతనాలు చేసినట్లు నిందితులు అంగీకరించారు..అలాగే 3 కార్లు అపహరించారు. ఇవేకాక మొదటి నిందితుడు తిరుపతి స్వామి ఇంతకు మునుపు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ, ఖమ్మం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలో అనేక నేరాలు చేసి ఉన్నాడు..
జైలుకు పోయి వచ్చిన ఇతని బుద్ధి మారకపోవడం విశేషం.. ఎట్టకేలకు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కెవీ.. రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టి ఇద్దరు నిందితులను కటకటాల పాలు చేయడం జరిగింది.. మంగళవారం నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ అన్ని వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇందుకూరుపేట ఎస్ఐలు.. పీ. నరేష్.. పీ. సుబ్రహ్మణ్యం. సీసీఎస్ ఎస్ఐ. వేణుగోపాల్, ఏఎస్ఐ. గిరిధర్ రావు.హెడ్ కానిస్టేబుల్.రమేష్, విశ్వనాథన్, అమీన్, రాము,ఇస్మాయిల్, యానాదయ్య, కానిస్టేబుల్స్ సతీష్,సాయి, హరీష్ రెడ్డి, వినోద్, గురునాథ్, వెంకటేశ్వర్లు, దేవ కిరణ్, రత్నం తదితరులకు ఎస్పీ రివార్డులను ప్రకటించారు..