ఇచ్చిన మాట మేరకు దశల వారీగా మధ్య నిషేధం నేటి నుండి అమలు – డిప్యూటీ సి ఎం
రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్రలో మహిళలకు ఇచ్చిన మాట మేరకు దశల వారి మధ్య నిషేధంలో భాగంగా నేటి నుండి 20% షాపులు తగ్గిస్తూ ప్రభుత్వమే నిర్వహణ భాద్యత చేపడుతున్నదని ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజుశాఖ మంత్రి కె నారాయణ స్వామి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహం లో ఉప ముఖ్య మంత్రి మీడియ సమావేశం లో ప్రసంగించారు. ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 4380 మద్యం షాపులు వుంటే, నేటి నుంచి 3500 ప్రభుత్వం నిర్వహణ చేపట్టిందని , దశల వారీగా 20 శాతం తగ్గింపు ప్రారంభిస్తున్నామని అన్నారు. గతంలో వున్న బెల్ట్ షాపులు 43 వేలు ను రద్దు చేశామని అన్నారు. మధ్యంధర పెంపు పేదలు మద్యానికి దూరంగా వుండాలనే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. మద్యం దుకాణాల సమయం ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు వుండేదని, నేటి నుంచి ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎం. ఆర్. పి. ధరలకు విక్రయ ధరల పట్టిక ప్రదర్శిస్తామని ఆన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మద్యం రాకుండా ఎంఫోర్స్ మెంట్, బార్డర్ చెక్ పోస్టుల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ల సహకారం తో మద్యం నిషేధం పై ప్రచారం, దాని వల్ల కలిగే చెడు, కుటుంబాలు పాడై పోయే విధానాలపై ప్రచారం చేపట్టనున్నామని అన్నారు. గత ప్రభుత్వం 2022 వరకు బార్లకు పర్మిషన్ ఇచ్చిందని దీనిపై పరిశీలన చేస్తున్నామని అన్నారు.
ఈ సమావేశం లో డిప్యూటీ కమీషనర్ ఎక్సైజ్ నాగలక్ష్మి, సూపరింటెండెంట్లు హనుమంతరావు , ఎం.ఆర్.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారూ..
డివిజినల్ పి ఆర్ ఓ, తిరుపతి –