మహిళ క్షుర‌కుల‌కు చీరలు అందించిన అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమలలోని కల్యాణకట్ట‌ మహిళా క్షుర‌కుల‌కు రెండు సెట్ల చీరలను అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి బుధ‌వారం అందజేశారు.తిరుమ‌ల క‌ల్యాణ క‌ట్టలో మొత్తం 1350 క్షుర‌కుల‌లో 220 మహిళా క్షుర‌కులు విధులు నిర్వ‌హిస్తున్నారు. గత వారం తిరుమలలోని అస్థాన‌ మండపంలో జ‌రిగిన‌ ఓరియంటేషన్ కార్యక్రమంలో మహిళా క్షుర‌కుల‌ అభ్యర్థన మేరకు బ్రహ్మోత్సవాలకు ముందు విరాళంగా చీరలు ఇస్తామని  అదనపు ఈవో వారికి హామీ ఇచ్చారు.మగ క్షుర‌కుల‌కు అవ‌స‌ర‌మైన యూనిఫామ్ ఇండెంట్‌ను సమర్పించాలని అద‌న‌పు ఈవో అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న మాట్లాడుతూ అద‌న‌పు ఈవో హామీ ఇచ్చినట్లుగా, అన్ని మహిళా  క్షుర‌కుల‌కు యూనిఫాం చీరలను అందజేసిన‌ట్లు తెలిపారు. యాత్రికుల‌కు అంకితభావంతో మరింత ఉన్న‌తంగా సేవలను అందించాల‌ని క్షుర‌కుల‌ను కోరారు.

About The Author