పాకిస్థాన్ కు పిడుగు లాంటి వార్త…
భారత్ విభజనాంతరం 1948 లో 7వ నిజాం నవాబు పాకిస్థాన్ అంబాసిడర్ హాబీబ్ ఇబ్రహీం రహీంతుల్లా పేరిట 1 మిలియన్ల పౌండ్ల కరెన్సీ ని లండన్ లోని NATIONAL WESTMINSTER BANK లో డిపాజిట్ చేశాడు..
బ్యాంక్ లోని నిధులు ఆయుధ నౌకల కొనుగోలు, మరమ్మతులు కోసం ఉద్దేశించినవని తమకు బహుమతి గా వచ్చినవని పాకిస్తాన్ తమ వాదనలను బ్రిటన్ హై కోర్ట్ కి తెలిపింది..
నిజాం వారసులు భారత ప్రభుత్వం తో కలసి 70 ఏళ్లుగా పోరాడుతున్న ఈ కేసులో నిజాం సొమ్ముపై పాకిస్థాన్ కు ఎలాంటి హక్కు లేదని లండన్ రాయల్ కోర్ట్ తెలిపింది..
నాట్ వెస్ట్ బ్యాంక్ లో నిజాం డిపాజిట్ చేసిన సొమ్ము వడ్డీతో కలిపి 35 మిలియన్ల పౌండ్ల కి చేరింది..