తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు శుక్రవారం,ఉదయం 6 గంటలసమయానికి,నిన్న 84,490 మందిభక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోగదులన్నీభక్తుతో నిండినది, భక్తులు బైట వేచి ఉన్నారు,
ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును
నిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 2.95 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును,
గమనిక:
అక్టోబరు 15, 29నవృద్ధులు, దివ్యాంగులకుప్రత్యేక ఉచిత దర్శనం,అక్టోబరు 16, 30 తేదీల్లోచంటిపిల్లల తల్లిదండ్రులకుశ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వరకు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,
భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు,
వయోవృద్దులు / దివ్యాంగులఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలుసుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి