భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ మహాబలిపురంలో భేటీ అయ్యారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ శుక్రవారం (అక్టోబర్ 11) తమిళనాడులోని మహాబలిపురంలో భేటీ అయ్యారు. అనంతరం తన కాన్వాయ్‌లో ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌కు బయలుదేరి వెళ్లారు జిన్‌పింగ్. కాసేపు హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అనంతరం మహాబలిపురంకు బయలుదేరి వెళ్లారు.
అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు మహాబలిపురంకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి ఆకట్టుకున్నారు. ధోవతీ చొక్కా ధరించిన ప్రధాని కొత్త గెటప్‌లో అట్రాక్ట్ చేశారు. జిన్‌పింగ్‌కు మహాబలిపురం ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. పల్లవ రాజులు సముద్రతీరంలో నిర్మించిన షోర్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు.
యూనెస్కో మహాబలిపురం ఆలయంను వారసత్వ సంపదగా గుర్తించిందని మోడీ తెలిపారు. ఇరు దేశాధినేతలు ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. అనంతరం ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత తమిళ రుచులతో కూడిన భోజనం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విందులో ఏర్పాటు చేశారు