హేల్మట్ తప్పక ధరించండి మీ ప్రాణాలతో పాటు మీ కుటుంబాన్ని కాపాడుకోండి

తిరుపతి చిత్తూరు జిల్లా:సురక్షిత నగరము కార్యక్రమము మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు తీసుకొన్న రహదారి భద్రతా  చర్యలలో భాగంగా తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా యస్.పి డా”గజరావు భూపాల్ ఐ.పి.యస్ గారి సూచనల మేరకు తిరుపతి ట్రాఫిక్ డి.యస్.పి శ్రీ యస్.డి‌.ముస్తాఫా, తిరుపతి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ యం.సురేష్ కుమార్ మరియు యస్.ఐలు  స్వాతి (గాజులమండ్యంపి.యస్), నరేంద్ర (యం.ఆర్.పల్లి పి.యస్) పత్రికా ముఖముగా తిరుపతి పట్టణ ప్రజలకు ఈక్రింది విధముగా సూచనలు తెలియజేసినారు. నిన్నటి దినము అనగా 11-10-2019 తేదీన నగర పరిధిలోని గాజులమండ్యం  పి.యస్, గాజులమండ్యం పి.యస్ లలో జరిగిన వేరు వేరు రెండు మోటారు సైకిల్ ప్రమాధ ఘటనలో వాహన చోదకులు ఇరువురు మరణించడమైనది. సదరు ప్రమాదకారణమును విశ్లేచించగా వాహన చోదకులు శిరస్త్రాణము (హెల్మెట్) ధరించక పోవడము వలనే మరణము సభవించి నట్లుగా తెలియచున్నది .  ఇంధు విషయమై రహదారి భద్రత చర్యలలో భాగముగా ప్రతి ఒక్క వాహన చోదకుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి.

About The Author