తిరుచానూరు గ్రామానికి డెంగ్యూ జ్వరం

విష జ్వరాలతో “గజగజ” వనుకుతున్న గ్రామ ప్రజలు

నామ మాత్రంగా దోమల నివారణ   చర్యలతో పంచాయతీ ఆరోగ్యశాఖ, గ్రామంలో విష జ్వరాల బారిన పడిన సుమారు 5 వేల మంది ప్రజలు.

తిరుచానూరు:తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు పంచాయతీలోని నేతాజి వీధికి చెందిన కె.అముధ వయసు 35 వివాహిత మహిళ దోమ కాటుతో డెంగ్యూ భారినపడి 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి  సోమవారం మృతిచెందారు.

ఇదే గ్రామంలో గ్యాస్ డెలివరి బాయ్ గా పనిచేస్తున్న  తన భర్త శేఖర్ మరియు వారి ముగ్గరు పిల్లలతో సంతోషంగా జీవించేవారు.గత పదిహేను రోజులు క్రితం వరకు భర్త పిల్లలతో హాయిగా సంతోషంగ జీవించిన  ఆమె కేవలం దోమ కాటుకు బలి అయి విషజ్వరము అయిన డెంగ్యూ బారినపడి ఆసుపత్రి పాలైనది.చివరకు వ్యాధి మెదడుకు సోకడంతో మృత్యువుతో పోరాడి తనువు చాలించింది.  ఇది ఇలా వుండగా గత నెల రోజులుగా పడిన వర్షాలకు వర్షపు నీరు గుంటలు,చెరువులు తలపించేలా గ్రామంలో పలు ప్రాంతాలలో దర్శనమిస్తున్నది.వాటిలో కొన్ని ప్రాంతాలలో పంచాయతీ ఆరోగ్యశాఖ వారు బ్లీచింగ్ మరియు దోమల నివారణ మందులు వెదజల్లినా అప్పటికీ ఈ గ్రామం 30 వేల మంది నివాసం ఉంటున్నారు

 

About The Author