రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

తిరుపతి, అక్టోబర్ 15: నెల్లూరు జిల్లాలో వై.ఎస్.ఆర్. రైతుభరోసా పథకం ప్రారంభోత్సవానికి వెళుతూ ఉదయం 10.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి ఘనస్వాగతం లభించింది.

రాష్ట్రముఖ్యమంత్రితో పాటు ప్రత్యేక విమానంలో పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, హోమ్ శాఖ మంత్రి సుచరిత రాగా విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయితీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప,  శాసన సభ్యులు శ్రీకాళహస్తి మధుసూధన్ రెడ్డి, కోడూరు శ్రీనివాసులు , జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా, జాయింట్ కలెక్టర్ మార్కండేయులు,

నగరపాలక కమిషనర్ గిరిషా, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి, చిత్తూరు ఎస్.పి.సెంథిల్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి . గజరావ్ భూపాల్, తహశీల్దార్ విజయసింహా రెడ్డి, నాయకులు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మొహిత్ రెడ్డి, తదితరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు. ఆనంతరం ముఖ్యమంత్రి హెలికోప్టర్లో నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. — డివిజనల్ పి.ఆర్.ఓ.

About The Author