మంత్రి హరీష్ రావు గారి తో కలిసి విత్తన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు….


మంత్రి హరీష్ రావు గారి తో కలిసి విత్తన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు….

రాబోయే రోజుల్లో పంటలు పండించే విత్తనాలు అంతర్జాతీయ స్థాయికి అందించే రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మంత్రి నిరంజన్ రెడ్డిలు అన్నారు.సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాముల పర్తి గ్రామంలో ప్రముఖ విత్తన ఉత్పత్తి సంస్థ కావేరి సీడ్స్ ఏర్పాటు చేసిన విత్తన పరిశోధన సం స్థను మంత్రులు హరీశ్‌రావు,నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ సంస్థలోని పలు విత్తనాల పరిశోధన చేపడుతు న్న క్రమాన్ని మంత్రులకు కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ దేశంలోనే ఉష్ణోగ్రత స్థితిగతులను తట్టుకొని విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థం కలిగిన నేలలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో దేశంలో విత్తన భాంఢాగారంగా వెలసిల్లనుందని అన్నారు. దేశంతో పాటు ప్రపంచ దేశాలకు విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే సియం కెసిఆర్ లక్షమని అన్నారు. ప్రపంచ స్థాయి పేరుగల కావేరి విత్తనాల కంపెనీ ఇక్కడకు రావడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి,వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి పార్థ సారథి, శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు..

About The Author