కల్కి ఆశ్రమంపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం
చిత్తూరు: కల్కి ఆశ్రమంపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్ అక్రమ ఆస్తులను కూడబెట్టారని అన్నారు. ప్రజా సంక్షేమం పేరుతో ఆయన రూ.కోట్లు దోచుకున్నారని చెప్పారు. ‘ ప్రభుత్వ భూములు ఆక్రమించారు. ఇసుక అక్రమ రవాణా చేశారు. హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రమం పని చేస్తోంది. కల్కి ఆశ్రమంలో భగవాన్ తనయుడు లోకేశ్ దాసోజి ఒక పార్టీకి కొమ్ముకాశారు. ఆశ్రమం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలి’ అని అన్నారు. కల్కి అలియాస్ విజయ్ కుమార్ బతికే ఉన్నారా? అనే దానిపైనా అనుమానాలున్నాయని, ఒక వేళ ఆయన బతికే ఉంటే ఫోటోలు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. కల్కి ఆశ్రమం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.